‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరోస్ లో వెంకీ మామ కూడా ఒకరు. ప్రస్తుతం తాను హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. డీసెంట్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది.

ఇక సమయం తక్కువ ఉన్నందున మిగతా అప్డేట్స్ కూడా చకచకా రానున్నాయి. దీనితో ఫస్ట్ సింగిల్ కి ఆల్రెడీ ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ వారాంతం లోనే ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ రావచ్చట. సెప్టెంబర్ 18 లేదా 19న థమన్ కంపోజ్ చేసిన మొదటి సాంగ్ రానున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హారిక హాసిని వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 2న విడుదలకి తీసుకొస్తున్నారు.

Exit mobile version