ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ కాంబినేషన్ పై లేటెస్ట్ బజ్.!


ప్రస్తుతం మన తెలుగు సినిమా దగ్గర అలాగే ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి హ్యాపెనింగ్ దర్శకుల్లో మన టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి ప్రశాంత్ వర్మ ఒక సూపర్ హీరో జానర్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ చేసిన “హను మాన్” (Hanu Man Movie) భారీ హిట్ కాగా ఈ సినిమా తర్వాత తన నుంచి మరిన్ని భారీ చిత్రాలు ఉన్నాయి.

అయితే వీటిలో అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) తో సినిమా కూడా ఒకటి. అసలు ఇది ఊహించని కాంబినేషన్ కాగా ఈ మాసివ్ కాంబినేషన్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీనితో అయితే ఈ సినిమా కూడా అతి త్వరలోనే స్టార్ట్ కావచ్చని అలాగే “జై హనుమాన్” (Jai HanuMan) తోనే లేదా మధ్యలోనే ఈ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది అని టాక్. మరి ఈ సినిమాని కూడా ప్రశాంత్ వర్మ ఓ ఊహించని కాన్సెప్ట్ తోనే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.

Exit mobile version