రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కుదిరినట్టేనా ?

Rajinikanth1

‘పేట’ సినిమా నుండి సూపర్ స్టార్ రజనీ వేగం పెరిగింది. మునుపటి కంటే చాలా చురుగ్గా కనిపిస్తున్న ఆయన చాలా త్వరగా సినిమాలు చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘దర్బార్’ చిత్రీకరణను కూడా మొదలుపెట్టిన కొన్నాళ్లకే పూర్తిచేశారు రజనీ. ఇదే వేగంతో కొత్త ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటుంన్నారట ఆయన.

ఈ చిత్రాన్ని శివ డైరెక్ట్ చెసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలోనే రజనీ శివను ఇంటికి పిలిపించికుని మరీ మాట్లాడారు. ఆ చర్చల్లోనే శివ ఆయనకు ఒక స్టోరీ లైన్ చెప్పాడట. దాన్ని డెవలప్ చేయమన్నారట రజనీ. ఇన్నిరోజులు ఆ పనిలనే ఉన్న శివ షూటింగ్ అనంతరం చెన్నై వచ్చిన రజనీని కలిశారట.

వీరి మధ్య చాలాసేపే చర్చలు జరిగాయట. మరి రజనీ శివకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే శివతో సినిమా ఓకే అయితే భిన్నమైన రజనీని చూసే అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారు.

Exit mobile version