మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ ఏడాది విడుదల అయ్యి డీసెంట్ రన్ ని చూసింది కానీ తన రేంజ్ హిట్ గా అయితే నిలవలేదు. ఇక దీని తర్వాత తాను చేస్తున్న సినిమా ‘ఇరుముడి’ కి మాత్రం సాలిడ్ బజ్ నెలకొంది. అనౌన్సమెంట్ నుంచే మంచి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రంని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది.
అయితే ఈ చిత్రం రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ఆగష్టు నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నట్టుగా టాక్. అప్పటికి సినిమా పనులు అన్నీ పూర్తయ్యిపోయి కంటెంట్ రెడీ అవ్వొచ్చట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా రీసెంట్ గానే బంగారు పల్లకి సాంగ్ రీమిక్స్ షూట్ ని కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ఇక అలాగే ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


