మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి ముందే గత ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసిన చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా మోస్ట్ అవైటెడ్ గా ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం అంతా నిశ్శబ్దంగానే ఉంది.
ఆ మధ్య ఎపుడో ఈ సినిమాని ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే.. ఇక ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ పై మరోసారి ఓ క్లారిటీ బయటకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ ప్లాన్స్ లో ఎలాంటి మార్పు లేదు మేకర్స్ ఈ ఏడాది వేసవి కనుకగానే ఈ విజువల్ ట్రీట్ ని అందిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
నేడు ఈ సినిమా దర్శకుడు వశిష్ఠ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ బెస్ట్ విషెస్ చెబుతూ అతను క్రియేట్ చేసిన విజువల్ ట్రీట్ ఈ వేసవిలో రానుంది అని తెలిపారు. సో ఈ ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా విడుదల ఉండవచ్చు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Team #Vishwambhara wishes its director @DirVassishta a very Happy Birthday ❤????
With his spectacular vision and storytelling, you are all in for a visual treat this summer ????????
MEGA MASS BEYOND the UNIVERSE ????
MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @mmkeeravaani… pic.twitter.com/ERdIiyKjEF
— UV Creations (@UV_Creations) January 8, 2026
