Mega 158: చిరు – బాబీ ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!

Chiru-Bobby

మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు అనే సెన్సేషనల్ హిట్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత విశ్వంభర సినిమాతో కూడా పలకరించనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత తాను చేయనున్న 158వ సినిమా తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం ఇప్పటికే ఆరంభం కావాల్సి ఉంది కానీ పలు కారణాలు రీత్యా ఇంకా ముహూర్తం కుదుర్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి. ముఖ్యంగా నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు తప్పుకున్నారు అంటూ పలు షాకింగ్ రూమర్స్ కొందరు స్ప్రెడ్ చేశారు. అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది.

దీని ప్రకారం ఆ రూమర్స్ లో ఎటువంటి నిజం లేదని కొట్టి పడేసారు. వీరి కాంబినేషన్ లో సినిమా ఖచ్చితంగా ఉందని, మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మాణం వహించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే సినిమా ముహూర్తం షూట్ కి సంబంధించిన వివరాలు కూడా అతి త్వరలోనే రివీల్ కానున్నాయి అని మెగా కాంపౌండ్ కన్ఫర్మ్ చేసింది. సో ఈ స్పెషల్ ప్రాజెక్ట్ విషయంలో ఉన్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు.

Exit mobile version