పవన్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై నయా రచ్చ.!

PawanKalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ రీఎంట్రీ గత ఏడాది అయ్యిపోవాలి కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అది కాస్తా వాయిదా పడింది. వేణు శ్రీరాం తో ప్లాన్ చేసిన ఈ “వకీల్ సాబ్” చిత్రం విడుదల ఏమో కానీ లేట్ గా మొదలు పెట్టినా శరవేగంగా పూర్తి చేసేస్తున్న మరో సినిమా విడుదలకు సంబంధించి ఇప్పుడు రచ్చ లేస్తుంది. అదే అయ్యప్పణం కోషియం రీమేక్.

ఈ చిత్రాన్ని కొన్నాళ్ల కితమే అనౌన్స్ చేశారు మళ్ళీ ఈ లోపలే మొదలు పెట్టేసి ముగించేసే పనిలో కూడా ఉన్నారు. అయితే గత రెండు రోజుల నుంచి మన టాలీవుడ్ లో ఊహించని విధంగా అనేక సినిమాలు రిలీజ్ డేట్ లు వరుస పెట్టి ఇచ్చేసి ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలను హీటెక్కించారు. మరి ఇదే సందర్భంలో పవన్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి కూడా రిలీజ్ డేట్ పై రచ్చ నడుస్తుంది.

దాదాపు అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది వినాయక చవితి కానుకగా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నట్టు వినిపిస్తుంది. అంటే సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో విడుదల అవుతుందని టాక్. మరి ఈ చిత్రం అప్పుడే వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో దగ్గుబాటి రానా మరో కీలక పాత్రలో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version