మన టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ నుంచి ఆల్రెడీ రెండు సినిమాలతో ఈ ఏడాది టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించడానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో కమర్షియల్ గా నారీ నారీ నడుమ మురారి హిట్టయితే ప్రయోగాత్మక చిత్రం బైకర్ కొంచెం అండర్ పెర్ఫామెన్స్ చేసింది. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత ఈ ఏడాదిలోనే మూడో సినిమా ‘భోగి’ కూడా రానుంది.
అయితే ఈ అన్ని సినిమాలు తర్వాత మళ్ళీ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి టార్గెట్ చేసిన స్పెషల్ కాంబినేషన్ శ్రీను వైట్ల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. దీని ప్రకారం శర్వానంద్, శ్రీను వైట్లల కాంబినేషన్ లో సినిమా ఈ జూలై నుంచి మొదలు కానుందట. అప్పటికి భోగి నుంచి శర్వా ఫ్రీ అయ్యి ఆ సినిమా మేకోవర్ లోకి మారనున్నాడు.
అంతే కాకుండా ఈ సినిమా కూడా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఉంటుంది కానీ మళ్ళీ ఇందులో ఫన్ తోనే సై ఫై టచ్ కూడా ఉండొచ్చు అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారే నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


