‘కొరియన్‌ కనకరాజు’ కోసం ప్రత్యేక గీతం !

Korean-Kanakaraju

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ రాశి కన్నా కనిపించనుందని టాక్. గతంలో రాశి – వరుణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

అన్నట్టు, ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్‌ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

Exit mobile version