నందమూరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన భారీ హిట్ చిత్రం “బింబిసార” నిన్నటితో ఏడాది కంప్లీట్ చేసుకోగా ఈ సినిమా హిట్ తర్వాత తాను మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు అయితే చేస్తున్నాడు. మరి అలా లేటెస్ట్ గా చేస్తున్న మరో చిత్రమే “డెవిల్”. టీజర్ తో సాలిడ్ బజ్ ని అందుకున్న ఈ చిత్రం భారీ హంగులతో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది.
ఇక ఈ చిత్రానికి అయితే నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తుండగా మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ ని చేయాల్సి ఉంది. కానీ పలు వర్క్స్ మూలాన లేట్ కాగా ఇపుడు అయితే మేకర్స్ మరో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. దీనితో అయితే ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం ఓ ప్రముఖ స్పై జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.
