‘వారణాసి’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్.. అసలేం జరుగుతుంది అంటే..?

‘వారణాసి’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్.. అసలేం జరుగుతుంది అంటే..?

Published on Apr 17, 2026 8:57 PM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’. గత నెల రోజులుగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ జరుగుతోంది. ప్రస్తుతం ఒక ప్రత్యేక సెట్‌లో టాప్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నేతృత్వంలో మహేష్ బాబుపై ఒక అద్భుతమైన సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది.

​ఈ పాట పూర్తయిన వెంటనే చిత్ర యూనిట్ మే నెలలో సమ్మర్ బ్రేక్ తీసుకోనుంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా మహేష్ బాబు మరియు రాజమౌళి తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ చిన్న విరామం తర్వాత, జూన్ నుండి షూటింగ్ మళ్ళీ ప్రారంభం కానుంది. రాజమౌళి ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. ఆ తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారు.

​భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మరియు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజా వార్తలు