‘తలైవి’ని తగ్గించే పనిలో మేకర్స్ !

Kangana

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలిత గారి జీవితం ఆధారంగా ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది, ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా లెంగ్త్ ను తగ్గించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

సినిమా మొత్తం లెంగ్త్ రెండు గంటల ఏభై ఐదు నిమిషాలు వచ్చిందని తెలుస్తోంది. దాన్ని పది నిమిషాల వరకు తగ్గించడానికి ఏ.ఎల్ విజయ్ ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ సినిమా కోసం ‘కంగనా’ బాగా కష్టపడింది. సినిమాలో కంగనా మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుంది. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు.

దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Exit mobile version