బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ యుద్ధ సన్నివేశాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో బాలయ్య – మిగిలిన ప్రధాన పాత్రల పై భారీ యాక్షన్ విజువల్స్ ను ఘాట్ చేస్తారట. పైగా ఈ సీక్వెన్స్ లో బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకి సంబంధించి థమన్ ఇప్పటికే, రెండు ట్యూన్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలయ్యను ఒక రాజుగా చూపించారు. అలాగే, నయనతారని ఒక మహారాణి పాత్రలో కనిపించనుందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు గతంలో బాలయ్య – నయన్ కలిసి ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
