పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. వచ్చే నెల మొదట వారంలో ప్రభాస్ – త్రుప్తి దిమ్రిని కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో ఉంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.
