‘కొరియన్‌ కనకరాజు’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Korean-Kanakaraju

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. వరుణ్ తేజ్ పై ఓ కామెడీ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే స్పెషల్ కామెడీ ఎపిసోడ్ లా ఉంటుందట. మేర్లపాక గాంధీ మార్క్ మేకింగ్ తో ఈ ఎపిసోడ్ లో ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందట.

అన్నట్టు, ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్‌ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

Exit mobile version