‘మహా సముద్రం’ కథ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

maha samudram
శర్వానంద్ – సిద్ధార్ద్ కీలకపాత్రలుగా టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మహా సముద్రం’. కాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. చిన్న తనంలోనే ఒకరి పై ఒకరు ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. శర్వానంద్ – సిద్ధార్ద్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉంటాయట. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా కూడా ఉంటుందట. త్వరలోనే ఈ సినిమా తరువాత షెడ్యూల్ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో అనే ఇమేజ్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో ఎలా కనిపిస్తాడో చూడాలి.

Exit mobile version