“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

SarkaruVaariPaata

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “సర్కారు వారి పాట”. మంచి అంచనాలే సెట్ చేసుకున్న ఈ చిత్రం మొట్ట మొదటి షెడ్యూల్ నే సూపర్ స్పీడ్ తో మేకర్స్ దుబాయ్ లో కానిచ్చేస్తున్నారు.సంక్రాంతి రేస్ కు ఫిక్స్ చేసిన ఈ సినిమాలో మైండ్ బ్లాకింగ్ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేసిన సంగతి కూడా చూసాము.

మరి జెట్ స్పీడ్ తో ఈ మొదటి షెడ్యూల్ ను మేకర్స్ పూర్తి చేసేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మహేష్ ఫ్యాన్స్ కూడా దర్శకుడు పరశురామ్ పెట్లపై కూడా నెవర్ బిఫోర్ అంచనాలు పీక్స్ లో పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇస్తుండగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version