నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే ‘ది ప్యారడైజ్’. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదట సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. కాసర్ల శ్యామ్ రచనలో అనిరుద్ మాస్ బీట్స్ ఇప్పటికీ మోగుతూనే ఉన్నాయి.
ఇక మళ్ళీ ఇదే కలయికలో రెండో సాంగ్ కూడా రాబోతున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కాసర్ల శ్యామ్ కు అనిరుద్ దణ్ణం పడుతుంటే కాసర్ల శ్యామ్ తన ఆశీర్వాదాన్ని అనిరుద్ కి అందిస్తున్నారు. ఈ ఫోటోని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరాతో బంధించగా.. జస్ట్ రెండో సాంగ్ తాలూకా రికార్డింగ్ పూర్తి చేసినట్టుగా శ్రీకాంత్ సాలిడ్ అప్డేట్ ని అందించాడు.
అతి త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఈసారి సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదలకి తీసుకురాబోతున్నారు.
Just finished recording our second single…
Gear up with your speakers… out soon 🫶🏻 pic.twitter.com/lnn9xuXlAR
— Srikanth Odela (@odela_srikanth) August 25, 2026
