మన టాలీవుడ్ నుంచి రానున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రాల్లో వెంకీ మామ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తమ దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం కూడా ఒకటి. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే మంచి బజ్ ని సెట్ చేసుకుంది. ఇలా సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టుకోవాల్సి ఉండగా ప్రస్తుతం ఓ లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.
దర్శకుడు అనీల్ అండ్ టీం సినిమా తాలూకా స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారట. ప్రస్తుతం విశాఖపట్నంలో టీం మకాం వేసి స్క్రిప్ట్ పైనే సీరియస్ గా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇది పూర్తయ్యాక ఇక సినిమా పట్టాలెక్కడమే బ్యాలన్స్ అట. ఈ గ్యాప్ లో వెంకీ మామ త్రివిక్రమ్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ కూడా పూర్తి చేసుకోనున్నారు. ఇక వెంకీ మామ, కళ్యాణ్ రామ్, అనీల్ ప్రాజెక్ట్ ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


