మ్యాడ్ కాంబినేషన్ ఇంకా ఆన్ లోనే ఉందా? మరో ప్రశాంత్ తో ప్రభాస్, హోంబళే ఫిల్మ్స్

మ్యాడ్ కాంబినేషన్ ఇంకా ఆన్ లోనే ఉందా? మరో ప్రశాంత్ తో ప్రభాస్, హోంబళే ఫిల్మ్స్

Published on May 29, 2026 3:11 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో మరికొన్ని సినిమాలు ఇంకా యాడ్ కావాల్సి ఉంది. అయితే లైనప్ లో కొన్నాళ్ల కితం ఫ్యాన్స్ ని ఎంతగానో ఎగ్జైట్ చేసిన మ్యాడ్ కాంబినేషన్ ఒకటి ఉంది. అదే దర్శకుడు ప్రశాంత్ వర్మ అలానే ప్రభాస్ ఇంకా నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారి కలయిక.

తర్వాత మళ్ళీ ఈ భారీ కాంబినేషన్ పై పెద్దగా చప్పుడు లేదు కానీ లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ వేసిన పోస్ట్ తో వీరి కలయికలో సినిమా ఉందనే మళ్ళీ టాపిక్ మొదలైంది. ఆల్రడీ ఒక ప్రశాంత్ తో సలార్ సినిమా చేసి సెన్సేషనల్ హిట్ కొట్టారు హోంబళే సంస్థ.

ఇప్పుడు మరో ప్రశాంత్ సిద్ధం చేస్తున్న కొత్త అద్భుతాన్ని చూపించేందుకు ఎగ్జైటెడ్ గా ఉన్నాము అని కన్ఫర్మ్ చేశారు. సో ఇది ప్రభాస్ తో సినిమానే అని దాదాపు కన్ఫర్మ్ అయ్యిపోయింది. అయితే ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్, ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నారు. మరి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

తాజా వార్తలు