లేటెస్ట్ : ‘లియో’ థియేటర్స్ లో ‘VD 13’ టీజర్ ప్రదర్శన

vd13

యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా రెండు సినిమాల్లో హీరోగా నటిస్తుండగా అందులో ఒకటి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా VD 13 వర్కింగ్ టైటిల్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ, పరశురామ్ ల కలయికలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అందుకోవడంతో దీని పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ క్రేజీ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ ని అక్టోబర్ 18న సాయంత్రం 6 గం. ల 30ని. లకు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ టైటిల్ టీజర్ ని అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ మూవీ లియో రిలీజ్ కానున్న థియేటర్స్ లో ప్రదర్శితం చేయడానికి సిద్ధం అయ్యారు మేకర్స్. కాగా టీజర్ తోనే మూవీ యొక్క రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు. కాగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version