కొండ ప్రాంతంలో ఇల్లు కట్టుకోబోతున్న హీరోయిన్ !

lavanya

హీరోయిన్ లావణ్య త్రిపాఠీకి ప్రకృతితో మమేకం అవ్వడం ఎంతో ఇష్టమట. ఆమె సహజసిద్ధమైన ప్రకృతి ప్రేమికురాలు అట. అందుకే తాజాగా లావణ్య ప్రకృతిలోనే తన కొత్త నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కొండ ప్రాంతంలోని పచ్చని చెట్లు మధ్యలో ఓ ఇల్లు కట్టుకోబోతున్నారు. ఆమెకు పచ్చని చెట్లన్నా, పంట పొలాలన్నా ప్రాణం అట.

అందుకే లావణ్య ముస్సోరీకి దగ్గర్లో కొండ మీద ఉన్న చమసారి అనే గ్రామంలో వ్యవసాయ భూమిని కొన్నారు. ఇప్పుడు అక్కడే తన ఫ్యామిలీ కోసం ఒక ఇల్లును కట్టుకోవాలని లావణ్య నిర్ణయించుకుంది. ఐతే ఆమె కట్టించబోయేది రెగ్యులర్‌ హౌస్ కాదు, ఒక కేఫ్‌ ని తలపించేలా ఇల్లు కట్టించాలనే ఆలోచనలో లావణ్య ఉంది. తన కేఫ్ లాంటి ఇంటి గురించి చెబుతూ ఇది కేవలం నా కుటుంబ సభ్యుల కోసమే కట్టిస్తున్నాను. వ్యాపారం కోసం కాదు అంటూ చెప్పుకొచ్చింది లావణ్య.

Exit mobile version