ఘనంగా జరిగిన ‘లా’ ట్రైలర్ లాంచ్ !

LAW

కమల్ కామరాజ్ , మౌర్యాణి, పూజా రామచంద్రన్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు గగన్ గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘లా. ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ కమల్ నాకు ఎప్పటినుండో స్నేహితుడు. సినిమా పై అతనికుండే అభిరుచి నాకు బాగా తెలుసు. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ‘ లా ’ అంటే కోర్ట్ రూం డ్రామా అనుకున్నాను. కానీ ట్రైలర్ నన్ను సర్ ప్రైజ్ చేసింది. కాప్ లుక్స్ లో కమల్ చాలా బాగున్నాడు. మంచి విజయం సాధించాలను కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు గగన్ గోపాల్ ముల్కా మాట్లాడుతూ హీరో కమల్ అందించిన సహాకారం మరిచిపోలేను. హీరోగానే కాదు కథ బాగా రావడానికి నా వెనక ఒక బలంగా మారి నడిపించారు. హీరోయిన్స్, మౌర్యాణి, పూజాగారు అందించిన సహాకారం తో 30 డేస్ లో కంప్లీట్ చేయగలిగాం. ఇది కంప్లీట్ విజయవాడ లో రూపొందించిన మూవీ, సాంగ్స్ కూడా అక్కడే చేసాం. నిర్మాత రమేష్ గారు ఎప్పుడూ కథ గురించే ఆలోచించేవారు, ఖర్చు కోసం ఎక్కడా ఆలోచించలేదు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి బాగోపోతే వందమందికి చెప్పండి కానీ దయచేసి సినిమా ని చూడండి అన్నారు.

హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ ఏదైనా పండుగ చేసే కునే ముందు ఊరెగింపు తో మొదలు పెడతాం. ఇప్పుడు మా ట్రైలర్ తో మేము సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడం మొదలు పెట్టాం ఇకపై అంతా బాగుంటుందని నమ్ముతున్నాను. ప్రమోషన్స్ ను కూడా చాలా బాగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. సినిమా ని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను అన్నారు.

Exit mobile version