
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘ముని 3 – గంగ’. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభమయింది. ప్రస్తుతం ఈ సినిమాలో పాటను చిత్రీకరిస్తున్నారు. రాఘవ లారెన్స్ స్వయంగా కోరియోగ్రఫీ చేస్తున్న ఈ పాటలో హీరోయిన్ తాప్సి కూడా డాన్స్ చేస్తుంది. ‘ లారెన్స్ మాస్టర్ తో షూటింగ్ అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక మేజిక్ ఉంటుంది. అతని క్రియేటివిటీతో మనల్ని ఆకట్టుకుంటారు. అని తాప్సి పేర్కొంది.
హారర్ – కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐదుగురు సంగీత దర్శకులు స్వరాలను అందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. డిసెంబర్ నెలాఖరు కల్లా సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణలో రాఘవ లారెన్స్ గాయపడడంతో చాలా రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
There is definitely something about shooting a song with lawrance master. His creativity can stun! M sure this song will be huge! Happy me!
— taapsee pannu (@taapsee) November 27, 2014