
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉంది. తన సంగీతంతో తెలుగు, తమిళ, మళయాల సినీ పరిశ్రమలను ఉర్రూతలూగించిన ఆయన, గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ 87 ఏళ్ళ లెజెండరీ సంగీత దర్శకుడు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధ పడుతున్న ఆయన ఇప్పటికే తన జ్ఞాపక శక్తిని కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఎమ్.ఎస్.విశ్వనాథన్ అభిమానులు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని మొక్కుకుంటున్నారు. చెన్నై డాక్టర్లు తమ శక్తిమేర ఆయన కోలుకునేలా చూసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఎస్.పీ. బాలసుబ్రమణ్యం, ఇళయరాజా తదితరులు ఆయనను పరామర్షించారు. సుమారు 1200కు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన ఎమ్.ఎస్.విశ్వనాథన్, తెలుగులో ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘అంతులేని కథ’ లాంటి సినిమాలతో మంచి ఖ్యాతి గడించారు.