అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 37.2 కోట్ల వసూళ్లను దాటినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రెండో రోజు ఏకంగా రూ. 20.5 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించడం నిజంగా విశేషమే. పైగా మొదటి రోజు వసూళ్లు (రూ. 16.7 కోట్లు)తో పోలిస్తే, రెండో రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఎలాగూ, వీకెండ్ సందర్భంగా థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య బాగా పెరుగుతుంది.
ఈ రోజు ఆదివారం కాబట్టి, ప్రేక్షకుల రాక ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుతో వచ్చే కలెక్షన్స్ ను కూడా కలుపుకుంటే.. మొత్తం వసూళ్లు సులభంగా రూ. 50 కోట్ల మైలురాయిని అధిగమిస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రధాన ప్రాంతాల్లో ఈ రోజు షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి.
కాగా ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనకి నిర్మాతలు అక్కినేని నాగార్జున – సూర్యదేవర నాగ వంశీ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో సునీల్, బ్రహ్మాజీ, శివాజీ మరియు ఈశ్వరీ రావు వంటి సహాయ నటీనటులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మొత్తానికి ఈ సినిమా పై అఖిల్ పెట్టుకున్న హోప్స్ నిజం అయ్యాయి.



