అక్కినేని యంగ్ హీరో అఖిల్ – దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) కలయికలో వచ్చిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతుంది. థియేటర్లలో ఈ సినిమా సాధించిన అఖండ విజయానికి టికెట్ బుకింగ్‌లే స్పష్టమైన నిదర్శనం. మొదటి రోజు బుక్ మై షోలో 191K టికెట్లు అమ్ముడవగా, రెండవ రోజు 36% వృద్ధితో 261K టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ భారీ పెరుగుదల ఈ సినిమాకు భారీ వసూళ్లను అందించేలా చేసింది.
కాగా ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనకి నిర్మాతలు అక్కినేని నాగార్జున – సూర్యదేవర నాగ వంశీ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో సునీల్, బ్రహ్మాజీ, శివాజీ మరియు ఈశ్వరీ రావు వంటి సహాయ నటీనటులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మొత్తానికి ఈ సినిమా పై అఖిల్ పెట్టుకున్న హోప్స్ నిజం అయ్యాయి.
