అఖిల్ కంబ్యాక్.. భాగ్యశ్రీ ఫస్ట్ హిట్.. ‘లెనిన్’ రిజల్ట్!

ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి విడుదలకి వచ్చిన అవైటెడ్ సినిమానే “లెనిన్”. యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా నేడు గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా రిజల్ట్ మాత్రం అఖిల్ తో పాటు భాగ్యశ్రీ కి కూడా ఎంతో కీలకం అని చెప్పాలి.

ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ నుంచి చాలా ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఏజెంట్ ప్లాప్ కావడం, అక్కడ నుంచి గ్యాప్ రావడంతో అభిమానులు తన కంబ్యాక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక భాగ్యశ్రీ పరిస్థితి ఇంకొంచెం కఠినం అని చెప్పాలి. ఆమె టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం గుర్తింపు బాగానే వచ్చింది కానీ కావాల్సిన హిట్ మాత్రం దొరకలేదు. సో లెనిన్ అనేది ఇప్పుడు ఇద్దరికీ కీలకం. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. సో లెనిన్ వారికి లెనిన్ కలిసి వస్తుందో లేదో చూడాల్సిందే.

Exit mobile version