ఆకట్టుకుంటున్న ‘లియో’ నుండి సంజయ్ దత్ ఫస్ట్ లుక్ గ్లింప్స్

sanja
ఇళయదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ లియో. ఈ మూవీ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో సైతం విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే లియో నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోషిస్తున్న ఆంటోనీ దాస్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని నేడు రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక నేడు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పవర్ఫుల్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది. యాక్షన్ స్టైల్ లో రూపొందిన ఈ గ్లింప్స్ లో ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్ పవర్ఫుల్ గా ఉన్నారు. కాగా లియో మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ మూవీని అక్టోబర్ 19న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Exit mobile version