టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న రజినీకాంత్ ‘లింగ’

lingaa

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లింగ’. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటక లోని శిమోఘలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ నిన్నటితో పూర్తయ్యింది. ఇక ఈ సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటలని అక్టోబర్ 1 నుంచి స్పెయిన్, ఇటలీలలో షూట్ చేయనున్నారు. అలాగే దీపావళి కానుకగా అక్టోబర్ 23న ఈ మూవీ ఆడియో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కథా పరంగా గ్రాఫిక్స్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసిన లింగ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాల తర్వాత రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version