
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లింగ’. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆ సాంగ్ ని దుబాయ్ లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీం ఈ రోజు రాత్రికి ‘లింగ’ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెయ్యనున్నారు.
ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని నవంబర్ 9న రిలీజ్ చెయ్యడానికి గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఈ లోపు రజినీ తన ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ ని ఫినిష్ చెయ్యనున్నారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాల తర్వాత రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.