‘లింగ’ సినిమాలో 9 నిముషాలు కోత..

lingaa-sencor

నాలుగేళ్ళ విరామం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమాకు గత శుక్రవారం రజిని పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. అయితే సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మొదట షో తర్వాత పలువురు అభిమానులు, విమర్శకులు సినిమా నిడివి (174 నిముషాలు) చాలా ఎక్కువైందని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అదే సినిమాకు ప్రధాన అడ్డంకిగా మారిందని భావించిన చిత్ర బృందం సినిమాను 9 నిముషాలు ట్రిమ్ చేశారు. నేటి నుంచి ఎడిట్ వెర్షన్ ప్రదర్శిస్తారు.

మాకు అందిన సమాచారం ప్రకారం.. ఫస్ట్ హాఫ్ లో 6 నిముషాలు, సెకండ్ హాఫ్ లో 3 నిముషాలు ట్రిమ్ చేశారు. దర్శక నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం సినిమాకు ఎంత వరకూ ఉపయోగపడుతుందో..? చూడాలి.

Exit mobile version