సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా ఆడియో రిలీజ్ ఈ రోజు ఉదయం చెన్నైలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో లాంచ్ ఈ సినిమాకి పని చేసిన వారు, తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖులు మరియు పలువురు రాజకీయనాయకులు కూడా హాజరయ్యారు.
మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మరియు రజినీకాంత్ తో శివాజీ, రోబో లాంటి సినిమాలను తీసిన శంకర్ కూడా ఈ ఆడియో లాంచ్ కి వచ్చాడు. శంకర్ మాట్లాడుతూ ‘లింగ సినిమా రోబో కంటే పెద్ద హిట్ అవుతుంది. రోబో తర్వాత రజినీకి గ్యాప్ వచ్చింది. కానీ ఆ గ్యాప్ ని కెఎస్ రవికుమార్ కరెక్ట్ గా క్యాచ్ చేసి రజినీని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసి ఆడియన్స్ లో అంచనాలను పెంచేసాడు. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన డాం సీన్ ని చాలా బాగా షూట్ చేసాడని’ అన్నాడు.
ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.
