పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ఈ భారీ పాన్ ఇండియన్ ప్రాజక్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ హైప్ ఉంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, సలార్ తో ఇటీవల ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీకి లింక్ ఉందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.
దాని ప్రకారం బొగ్గు గనుల్లో పనిచేసే ఒక మాస్ గ్యాంగ్ లీడర్ గతంలో తన స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు ఇతర క్రిమినల్ గ్యాంగ్స్ ని ఏవిధంగా మట్టుబెట్టాడు అనేది సలార్ ప్రధాన కథాంశం అని అంటున్నారు. కాగా ప్రశాంత్ మల్టివర్స్ గా రూపొందుతున్న ఈ మూవీలో మోస్ట్ వయొలెంట్ మ్యాన్ అయిన సలార్, గతంలో తన స్నేహితుడైన రాఖీ భాయ్ కి చనిపోయే ముందు ఇచ్చిన మాటని నిలబెట్టేందుకు సిద్ధం అవుతాడని అంటున్నారు. అయితే ఇది ప్రస్తుతం మీడియా మాద్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ దీని పై ఎక్కడా కూడా క్లారిటీ లేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సలార్ రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.
