‘శ్రీమంతుడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

srimanthudu-poster
‘శ్రీమంతుడు’.. గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న తెలుగు సినిమా. సూపర్ స్టార్ మహేష్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా, మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. నేటితో విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టిన శ్రీమంతుడు, రెండో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఓ సోషల్ మెసేజ్ ఉన్న అంశాన్ని అన్ని కమర్షియల్ అంశాలతో జోడించి తీసిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాను కొనియాడారు.

మహేష్ లాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా కావడం, అంతటా సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి వారం ‘శ్రీమంతుడు’ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్, ఈ ఉదయం మొదటి వారం కలెక్షన్లకు సంబంధించిన వివరాల విడుదల చేశారు. మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని 66.50కోట్ల రూపాయల షేర్ సాధించిందని నిర్మాణ సంస్థ తెలిపింది.

మహేష్ అనితరసాధ్యమైన నటన, కొరటాల శివ టేకింగ్, బలమైన పాయింట్, మహేష్-శృతి హాసన్‌ల కాలేజీ ఎపిసోడ్, ఫ్యామిలీ సెంటిమెంట్ లాంటి అంశాలు శ్రీమంతుడు సినిమాకు బాగా కలిసివచ్చాయి. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమాను బాగా ఆదరిస్తున్న నేపథ్యంలో రెండోవారం కూడా ‘శ్రీమంతుడు’ మంచి కలెక్షన్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా అంచనా.

Exit mobile version