
‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ నుంచి వస్తున్న మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో గాడ్సే, బోసు పాత్రల్లో బాలకృష్ణ కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే భిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘లయన్’ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఒక కచ్చితమైన రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోలేకపోతోంది.
ముందుగా మే 1న అన్నారు, ఆ తర్వాత ఏప్రిల్ 30 అన్నారు, మళ్ళీ మే 1న అన్నారు. కానీ తాజాగా ఈ సినిమా మే 1న కూడా రిలీజ్ కావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే మే 7న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ టైంకి కూడా రెడీ అవ్వకపోతే వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. సత్యదేవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.