మార్చి చివర్లో బాలకృష్ణ ‘లయన్’.?

balayya-lion
‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత ఎన్నికల్లో తన జోరు చూపి హిందూపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అటు ఎమ్మెల్యే బాధ్యతలతో పాటు తన తదుపరి సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బాలకృష్ణ ‘లయన్’ అనే పవర్ఫుల్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం లయన్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ఓ పాత్ర సిబిఐ ఆ ఫీసర్ గా ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. గత సంవత్సరం ఇదే టైములో రిలీజ్ అయిన ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సంవత్సరం కూడా సమ్మర్ మొదట్లో వచ్చి సమ్మర్ విజేతగా నిలిచేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

Exit mobile version