లాక్ డౌన్ రివ్యూ : ‘ఇన్ టు ది నైట్’ (సీజన్ 1 – నెట్‌ఫ్లిక్స్)

నటీనటులు : పావ్లిన్ ఎటియెన్, లారెంట్ కాపెల్లుటో, స్టెఫానో కాసెట్టి, మెహ్మెట్ కుర్తులస్

డైరెక్టర్ : జాసన్ విన్‌స్టన్ జార్జ్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన సిరీస్ ‘ఇన్ టు ది నైట్’. జాసన్ విన్‌స్టన్ జార్జ్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

బ్రసెల్స్ విమానాశ్రయంలో ఈ కథ మొదలవుతుంది, అక్కడ ఒక యువతి సిల్వీ తన చెక్-ఇన్ సమయం దాటిందని దయచేసి తనను విమానంలో ప్రయాణించడానికి అనుమతించమని ఒక విమానయాన సంస్థను వేడుకుంటుంది. ఆమె పై జాలిపడి, ఎయిర్లైన్స్ కంపెనీ అంగీకరిస్తారు. సిల్వీ విమానంలో ఎక్కిన వెంటనే, నాటో అధికారి టెరెంజియో విమానాన్ని హైజాక్ చేసి పైలట్‌ను బెదిరిస్తాడు, వెంటనే విమానం స్టార్ట్ కాకపోతే అందరినీ చంపేస్తానని బెదిరిస్తాడు. దానితో వేరే మార్గం లేక పైలట్ టెరెంజియో సూచనలను అనుసరిస్తాడు. విమానంలో ప్రయాణికులు ఆందోళనలో ఉండగా టెరెంజియో వారికి ఒక రహస్యం చెబుతాడు. ఏమిటి ఆ రహస్యం ? విమానంలో ప్రయాణించేవారు తమ విభేదాలను పక్కనపెట్టి తమకు వచ్చిన సమస్య నుండి తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు ? వాళ్ళు తప్పించుకున్నారా లేదా అనేది మిగతా కథ.

 

ఏం బాగుంది :

ఈ సిరీస్ యొక్క నేపథ్యం అద్భుతమైనది మరియు మొత్తం కథలో మొదటి నుండి అనేక అద్భుతమైన క్షణాలు ఉన్నాయి. గతంలో, స్పీడ్, 2012,లాంటి అనేక విపత్తు చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి కంటే ఈ సిరీస్ లోని పాత్రలు అసాధారణమైన పరిస్థితిలో కొనసాగుతాయి. తమ మనుగడ కోసం వారు చేయగలిగినదంతా చేసే క్రమంలో వచ్చే సీన్స్ చాల బాగున్నాయి. సూర్యకాంతులు ప్రజలను చంపుతున్నాయని తెలిసే సీన్ లో ఐస్లాండ్, స్కాట్లాండ్ మరియు కెనడాతో సహా ఉత్తర అర్ధగోళంలోని వివిధ ప్రాంతాలలోని విమానాశ్రయాలలో ప్రజలు చనిపోతున్నట్లు చూపించే సీన్స్ చాల బాగున్నాయి. పైగా కథలోని అనేక పాత్రలు వారి స్వంత ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నందున ఆయా పాత్రల మధ్య బలమైన సంఘర్షణ కుదిరింది. కథ సాగుతున్న కొద్దీ, పాత్రలు ఒకదానితో ఒకటి పోరాడుతాయి, తరువాత పాచ్ అప్ అవుతాయి మరియు ప్రతిదీ బాగానే ఉంటుందని వారు అనుకున్నప్పుడు, వారి నిగ్రహం మరియు అహం చాలా విషయాలను మారుస్తాయి. ఒక విధంగా, ఈ కథ యూరోపియన్ యూనియన్‌లోని రాజకీయ దృష్టాంతానికి ఒక రూపకం,

 

ఏం బాగాలేదు :

ఉత్కంఠభరితమైన ప్రారంభ ఎపిసోడ్ తరువాత, సిరీస్ ఆ స్థాయిలో లేదు. కథా గమనం ఒక గమ్యం నుండి మరొక గమ్యస్థానానికి వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని సన్నివేవాలు ఆకట్టుకోవు. ముగ్గురు బ్రిటిష్ సైనికులు సబ్‌ప్లాట్ కూడా అనవసరం అనిపిస్తుంది. అదేవిధంగా, చాలా సార్లు, నటీనటుల మధ్య పరస్పర చర్యలు తగినంతగా లేవు. ఈ సిరీస్ లో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే ప్లే స్థిరంగా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో కొన్నిచోట్ల బాగా బోర్ కొడుతొంది.

 

చివరి మాటగా :

ఉత్కంఠభరితమైన ప్రారంభ ఎపిసోడ్ తరువాత, ఈ ‘ఇన్ టు ది నైట్’ కొత్త అనుభూతిని ఇస్తుంది, కానీ సీజన్ 1 అంచనాలకు అనుగుణంగా లేదు. అయినప్పటికీ, సిరీస్ లో ఇంట్రస్టింగ్ సీన్స్ తో పాట ఆకర్షణీయమైన విజుల్స్ అండ్ క్షణాలు చాలా ఉన్నాయి. అలాగే రాబోయే విపత్తు నుండి ఎలా తప్పించుకుంటాయనే దాని పై సాగిన ఈ సిరీస్ కొన్ని చోట్ల ఆసక్తిని బాగా రేకెత్తిస్తోంది. మీరు మంచి మలుపులు ఉన్న కథాకథనాలు కోసం చూస్తున్నట్లయితే, ఈ ‘ఇన్ టు ది నైట్’ మీకు మంచి ఎంపిక అవుతుంది.

123telugu.com Rating : 3/5

Exit mobile version