ఓటిటి సమీక్ష: ’29’ – తెలుగు డబ్ రోమ్ కామ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

29 the movie Review

ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూన్ 5, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : విధు, ప్రీతీ అస్రాని, మాస్టర్ మహేంద్రన్ తదితరులు
దర్శకత్వం : రత్న కుమార్
నిర్మాతలు : లోకేష్ కనగరాజ్, కార్తికేయన్ ఎస్
సంగీతం : సీన్ రొల్డన్
ఛాయాగ్రహణం : మాదేష్ మాణికం
కూర్పు : ఆర్ ఎస్ సతీష్ కుమార్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో తమిళ్ నుంచి డబ్బింగ్ అయ్యిన 29 అనే రోమ్ కామ్ సినిమా కూడా ఒకటి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిర్మాణం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తనకి 29 ఏళ్ళు వచ్చినా సత్య (విధు) తనకంటూ ఒక గుర్తింపు కావాలని కోరుకుంటాడు. అలానే సేలం నుంచి చెన్నైకి ఓ జాబ్ నిమిత్తం వస్తాడు. అప్పుడు వరకు తన ఇన్నేళ్ల జీవితంలో సింగిల్ గానే ఉన్న తన లైఫ్ లోకి విజ్జు అలియాస్ విజయ లక్ష్మి (ప్రీతి అస్రాని) వచ్చిన తర్వాత ఇద్దరూ గాఢ ప్రేమలో పడతారు. కానీ ఐఏఎస్ కావాలని కలలు గంటున్న విజ్జు, సత్యని వదిలేస్తుంది. అసలు ఎందుకు ఆమె అతనికి బ్రేకప్ చెప్పింది? తర్వాత సత్య తీసుకున్న స్టెప్ ఏంటి? మళ్ళీ ఇద్దరూ కలిసారా లేదా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో దర్శకుడు ప్లాన్ చేసుకున్న రొమాంటిక్ లవ్ థీమ్ మాత్రం ఈ తరహా సినిమాలని ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. పైగా తాను పాత్రలు డిజైన్ చేసుకున్న తీరు అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న కొన్ని సన్నివేశాలు చాలామంది యువతీ యువకుల నిజ జీవితాలకి దగ్గరగా ఉంటాయి. సో అందరికీ కాకపోయినా దాదాపు ఎక్కువ శాతం మందికి ఇందులో కథనం అందులోని ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి.

ఇక లీడ్ జంట విధు, ప్రీతీలు చాలా బాగా నటించారు. ఇద్దరి కెమిస్ట్రీ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది. వారి మధ్య లవ్ ట్రాక్, బ్రేకప్ అలానే చివరిలో ఒక పాజిటివ్ ఎండింగ్ లు డీసెంట్ గా అనిపిస్తాయి. వీరి ట్రాక్ తో పాటుగా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. అలాగే ఫస్టాఫ్ కథనంలో డీసెంట్ గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది.

మైనస్ పాయింట్స్:

ఈ మధ్య కాలంలో ఇలాంటి నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. అలానే ఇది కూడా మరో వెర్షన్ అని అనుకోవచ్చు. సో కొన్ని కొన్ని సీన్స్, మూమెంట్స్ వరకు ఓ వర్గం ఆడియెన్స్ కి బాగానే అనిపించినా అందరికీ ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. దీనితో పాటుగా సెకండాఫ్ లో హీరో విషయంలో తీసుకునే టర్న్, సడెన్ పోలీస్ డ్రామా ఇవన్నీ ఒకింత ఇరికించిన భావన కలుగుతుంది.

దీని అవసరం తర్వాత రివీల్ అవుతుంది కానీ ఈ ఎపిసోడ్ ని ఇంకాస్త బాగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగున్ను. అలానే హీరో హీరోయిన్ నడుమ ఇంటిమేట్ సీన్ సహా మరికొన్ని సీన్స్ సెకండాఫ్ లో కాలేజీ యాక్షన్ ఎపిసోడ్, చివరలో హీరోయిన్ పై ఫాదర్ సెంటిమెంట్ సీన్ లాంటివి సహజంగా అనిపించవు. అలాగే క్లైమాక్స్ ని కూడా ఇంకాస్త పాజిటివ్ గా ముగించి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. సీన్ రొల్డన్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా బాగా కంపోజ్ చేశారు. మాదేష్ మాణికం కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. ఆర్ ఎస్ సతీష్ కుమార్ ఎడిటింగ్ ఓకే.

ఇక దర్శకుడు రత్న కుమార్ విషయానికి వస్తే.. తాను చాలా వరకు మిడిల్ క్లాస్ ఆడియెన్స్, యువతీ యువకుల నిజ జీవితాలకి దగ్గరగా ఉండే లైన్ ని తీసుకున్నారు. దానిని చాలా వరకు బాగానే నడిపించారు. లవ్ సీన్స్ గాని, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా ప్లాన్ చేసుకున్నారు. కానీ సెకండాఫ్ ని ఇంకొంచెం బెటర్ గా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఇది పక్కన పెడితే తన వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ’29’ చిత్రం ఒక టైం పాస్ రోమ్ కామ్ అనుకోవచ్చు. లైన్ సింపుల్ గానే ఉంటుంది కానీ మేజర్ గా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగానే కథనాన్ని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. సో ఓటిటిలో అలా టైం కి చిన్న ఎమోషనల్ టచ్ తో ఓ రోమ్ కామ్ డ్రామా చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ట్రై చేయొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Exit mobile version