ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేసిన క్రేజీ కాంబినేషన్ సినిమా అనౌన్సమెంట్ ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కలయికలో ప్రకటించిన ప్రాజెక్ట్ అనే చెప్పాలి. చాలా రోజుల నుంచి క్రేజీ బజ్ తర్వాత అనౌన్స్ అయ్యిన ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ సెట్ అయ్యింది.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. తన గత చిత్రం “కూలీ” సినిమాకే తాను 50 కోట్లు అందుకున్నట్టు తెలిపాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమాకి ఏకంగా 75 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
తన గత సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసాయి. సో లోకేష్ కనగరాజ్ మార్కెట్ కి ఎలాంటి డెంట్ పడనట్టే అనుకోవాలి. సో తాను మరింత పెంచడాని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
