‘ఓజి’ బ్యూటీ డైరెక్ట్ ఓటీటీ సినిమాకి కొంచెం బ్రేక్!

Made in Korea

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ సూపర్ హిట్ చిత్రం ఓజి కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. అయితే ప్రియాంక నటించిన ఓ సినిమా ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. మరి ఆ చిత్రమే “మేడ్ ఇన్ కొరియా”. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాని వారు ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ కి తీసుకు రావాల్సి ఉంది.

ఈ అర్ధ రాత్రి నుంచే స్ట్రీమింగ్ కి వస్తుందని చాలామంది ఎదురు చూశారు కానీ నెట్ ఫ్లిక్స్ ట్విస్ట్ ఇచ్చింది. స్ట్రీమింగ్ కి చిన్న బ్రేక్ వేశారు. బహుశా ఈ గురువారం మధ్యాహ్నం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి రావచ్చు. సో అప్పుడు వరకు ఎదురు చూడాల్సిందే. అలాగే ఈ చిత్రాన్ని రా కార్తిక్ దర్శకత్వం వహించగా, మేడ్ ఇన్ కొరియా సమీక్ష కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.

Exit mobile version