లాక్ డౌన్ తర్వాత విడుదలైన మొట్టమొదటి భారీ తమిళ చిత్రం ‘మాష్టర్’. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు విజయ్ గత చిత్రాలకు వచ్చినంత భారీ హిట్ టాక్ రాలేదు. మిశ్రమ స్పందనే వచ్చింది. కానీ విజయ్ అభిమానులు మాత్రం సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. విమర్శకులు మాత్రం స్క్రిప్ట్ వీక్ అన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీలో కూడ సినిమా భారీ విజయాన్నే సాధించింది. మంచి వసూళ్లను రాబట్టుకుంది. తెలుగులో సైతం సినిమా సక్సెస్ అయింది. దీంతో విజయ్ లోకేష్ కనగరాజ్ పనితనం పట్ల నమ్మకం పెంచుకున్నారట.
ఒక్కసారి విజయ్ ఏ దర్శకుడితో అయినా కనెక్ట్ అయితే వరుస అవకాశాలు ఇస్తుంటారు. అలా లోకేష్ కబగరాజ్ కు కూడ ఇంకొక అవకాశం ఇస్తున్నారట ఆయన. తన 66వ సినిమా బాధ్యతలను ఆయనకే అప్పగిస్తున్నారట. ప్రస్తుతం విజయ్ 65వ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. లోకేష్ కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తవగానే వీరి కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యే సూచనలు ఉన్నాయి. రెండవ అవకాశం ఇస్తూనే ఈసారి స్క్రిప్ట్ మరింత పక్కాగా ఉండాలని సూచించారట విజయ్.
