హిట్ టాక్ వల్ల పెరిగిన’లవర్స్’ థియేటర్స్

Lovers-(8)
సుమంత్ అశ్విన్ – నందిత జంటగా నటించిన సినిమా ‘లవర్స్’ గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సెకండాఫ్ లో ‘మగజాతి ఆణిముత్యం’ పాత్రలో సప్తగిరి నటన, అతని కామెడీ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది.

ఈ సినిమా విజయంతో ఈ చిత్ర టీం మొత్తం చాలా ఆనందంగా ఉన్నారు. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమాని మొదట 163 స్క్రీన్స్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమాకి వచ్చిన మౌత్ పబ్లిసిటీ, పాజిటివ్ రెస్పాన్స్ వల్ల ఎగ్జిబిటర్స్ మరికొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయమని కోరగా ఈ చిత్ర నిర్మాతలు మరో 17 థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

సక్సెఫుల్ డైరెక్టర్ మారుతి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించిన ఈ సినిమా ద్వారా హరినాథ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. సూర్యదేవర నాగ వంశీ – మహేంద్ర బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.

Exit mobile version