మహిళల వ్యక్తిత్వం నేపథ్యంలో జొన్నవిత్తుల కొత్త సినిమా ‘లలిత’

ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో ‘లలిత’ పేరుతో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది. కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నందిని హీరోయిన్‌గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు.

మహిళల విశ్వాసం, వ్యక్తిత్వం నేపథ్యంలో సామాజిక అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు’ అనే క్యాప్షన్‌ను సినిమాకు ఖరారు చేశారు. మణి, నాగరాజు ద్వయం సంగీతం అందిస్తున్నారు. వేణువాదకుడైన నాగరాజుకు ఏపీ ప్రభుత్వం నుంచి కళారత్న, వేణుగాన విశారద పురస్కారాలు లభించాయి.

రఘుబాబు, పృథ్వీరాజ్, తాగుబోతు రమేష్, డీడీ శ్రీనివాస్, ఝాన్సీ మేఘనా, సురేష్ దామరపల్లి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

Exit mobile version