ఇంటర్నేషనల్ సినిమా దగ్గర దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్రం హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు ‘వేవ్స్ సమ్మిట్ 2025’ (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌరవ ఆహ్వానం అందడం విశేషం.
కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం ఆమె సినిమా రంగంలో ఎదుగుతున్న స్థాయిని చాటుతోంది.
‘మోటివ్ ఫర్ మర్డర్’ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్గా నటించిన జో శర్మ ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించగా, మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి.
