మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా నుంచి లేటెస్ట్ గా రయ్ రయ్ రారా సాంగ్ వచ్చి పాన్ ఇండియా లెవెల్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక ఈ సాంగ్ ని అద్భుతమైన సాహిత్యంతో రచించిన రచయిత అనంత్ శ్రీరామ్ ఈ సినిమా కోసం లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ని అందించారు.
ఒక్క ఏడాదిలో పది సినిమాలు వస్తాయి కానీ ఒక్క సినిమా మాత్రం పదేళ్లు నిలిచిపోయేలా ఉంటుంది అలాంటి సినిమా పెద్ది అని తాను తెలిపారు. ఈ సినిమాలో ప్రతీ అంశం అద్భుతం అని తాను కొనియాడారు. మంచి కథ, దర్శకుడు, నటులు పాటలు ఈ సినిమాలో ఉన్నట్టు తెలిపారు. దీనితో అభిమానులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
