నాగార్జున ‘మా’ ఇప్పుడు అయ్యింది ‘స్టార్ మా’.!

StarIndia_maatv
అక్కినేని నాగార్జున – అల్లు అరవింద్ – నిమ్మగడ్డ ప్రసాద్ ల నిర్మాణ సారధ్యంలో తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పాపులర్ టీవీ చానల్ మా టీవీ. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న మా టీవీ ఇప్పుడు స్టార్ ఇండియా తో భాగస్వామిగా మారింది. అసలు విషయంలోకి వెళితే ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన స్టార్ ఇండియా వారు మా టెలివిజన్ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని కొనుకున్నారు. దీంతో టెలివిజన్ మార్కెట్ లోకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం కల్పించనున్నారు.

ఈ విషయం పైన ఈ రోజు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ మరియు స్టార్ ఇండియా ప్రతినిధులు కలిసి మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్నీ తెలియజేశారు. ఇండియాలోనే స్టార్ ఇండియా వారు ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో రెండవ స్థానంలో ఉన్నారు. అలాంటి వారికి మా టీవీ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని అప్పగించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే ప్రస్తుతం అధికారికంగా జరగాల్సిన కొన్ని పనులు జరుగుతున్నాయి. అవి పూర్తి కాగానే స్టార్ ఇండియాతో పాటు కలిసి కొన్ని సరికొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని తెలిపారు.

స్టార్ ఇండియా వారు కూడా తెలుగు ప్రజలను మరిన్ని సూపర్బ్ ప్రోగ్రామ్స్ తో ఎంటర్టైన్ చెయ్యడానికి ట్రై చేస్తామని తెలిపారు. ఈ డీల్ తర్వాత ఎవరి ఓనర్ షిప్ ఎంత, ఎన్ని కోట్లకి మా చానల్ హక్కులు స్టార్ ఇండియా వారు దక్కిన్చుకున్నరనే విషయాలను త్వరలోనే తెలియజేస్తారు.

Exit mobile version