
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి 2’ అనుకున్న సమయం కంటే కొంత ముందుగానే విడుదలఅయ్యే అవకాశాలు వున్నాయి. ముందుగా ఈచిత్రం ఈ డిసెంబర్ 21 న విడుదలకానుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా ఉండడంతో ఈ చిత్రం ఒక వారం ముందుగానే థియేటర్లకు రావొచ్చు. త్వరలోనే ఈచిత్రం రిలీజ్ డేట్ ఫై క్లారిటీ రానుంది. ఇక ఈచిత్రానికి సెన్సార్ బోర్డు యూ / ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. బాలాజీ మోహన్ తెరకెక్కించిన ఈచిత్రంలో ధనుష్ సరసన ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఈచిత్రం సూపర్ హిట్ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా వస్తుండడంతో మారి 2 ఫై మంచి అంచనాలే వున్నాయి.