మాయ సినిమా నా కలల ప్రాజెక్ట్ : నీలకంట

Maaya-Movie-Logo-Launch
12గత సంవత్సరాలుగా రొటీన్ కి భిన్నంగా సినిమాలను తీసే దర్శకుల జాబితాలో నీలకంట ఎప్పుడూ నిలుస్తాడు. చమ్మక్ చల్లో సినిమాను మినహాయిస్తే ఆయన సినిమాలు కమర్షియల్ కి దూరంగా వుంటూ షో, విరోధి, మిస్సమ్మ వంటి సినిమాలను తీసాడు

ఇప్పుడు అతని తాజా చిత్రం మాయా షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో హర్షవర్దన్ రానే, అవంతిక, శుష్మరాజ్ మరియు నందిని రాజ్ లు ప్రధాన పాత్రధారులు. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదలచేసారు. ఈ వేడుకకు కె.ఎల్ దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, రామ్ మోహన్ హాజరయ్యారు. మధుర శ్రీధర్ ఈ సినిమాకు నిర్మాత

ఈ సినిమా గురించి దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ “షో సినిమా తీయక ముందే నేను మాయ సినిమా కధ రాసుకున్న. ఇది నా కలల ప్రాజెక్ట్. తరువాత ఎం జరుగుతుంది అని ఊహించగలిగే అతేంద్రియ శక్తులు కలిగిన హీరో మా సినిమాలో నాయకుడు. హర్షవర్ధన్ మంచి నటుడు. ఈ సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ ఫీలింగ్ ని ఇస్తుంది” అని తెలిపాడు. శేఖర్ చంద్ర సంగీతదర్శకుడు. బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్

Exit mobile version