త్వరలో విడుదల కానున్న “మ్యాడ్”

mad

మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్. మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ సంద‌ర్బంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ… “మన చుట్టూ జరుగుతున్న కొన్ని జీవితాల నుండి ప్రేరణ పొంది అంతే సహజంగా ఈ కథని చెప్పడం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక జంట, లివింగ్ రిలేషన్ లో ఉన్న మరోజంట జీవితాల్లో ఎలాంటి మలుపులు జరిగాయన్నది హృద్యంగా చెప్పడం జరిగింది. చిత్ర కథనం, సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమా చూసే ప్రేక్షకులకి నిత్యం మనకి తారసపడే మోడరన్ జంటల లైఫ్ స్టైల్ ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. హీరో, హీరోయిన్లు వారి వారి పాత్ర‌ల్లోకి ఇమిడిపోయి చాలా సహజంగా న‌టించారు. ఈ సినిమాకి రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం బాగా ఆక‌ట్టుకుంటుంది. పద్మశ్రీ కైలాష్ ఖేర్ ఇష్టపడి పాడిన సూఫీ పాట చిత్రానికి మరో హైలైట్ గా నిలుస్తుంది. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో నిర్మించిన ‘మ్యాడ్’ ఈతరం ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము”. అన్నారు.

Exit mobile version